వేసవిలో మాత్రమే దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, రుచికి తియ్యగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి
వీటిని కన్నడలో 'తాటి నుంగు', తమిళంలో 'నుంగు', ఇంగ్లిష్‌లో 'ఐస్ యాపిల్' అని అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో దర్శనమిస్తాయి
శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు అన్నీఇన్నీకావు. ఇందులో క్యాలరీలు తక్కువ మొత్తంలో, శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కువ మొత్తంలో ఇస్తాయి
ఎండాకాలంలో అధిక చెమట నుంచి ఉపశమనం పొందాలంటే తాటిముంజలు తినాల్సిందే. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయి
వీటిల్లో విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం అధికమొత్తంలో ఉంటాయి. ఈ పండ్లు లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి
వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తుంది
మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. అలాగే వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి
ముంజల పైన పొట్టులాగా ఉండే పైపొరలోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి అనారోగ్యంతో బాధపడేవారు తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది