ఉప్పుతో మధుమేహం ముప్పు.. 

10 November 2023

సాధారణంగా డయాబెటిట్ అనగానే జీవనశైలి, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తుందని భావిస్తుంటారు. పరిశోధనలో కొత్త విషయం వెల్లడైంది. 

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మధుమేహం ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పుకు, మధుమేహానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ అధ్యయనం చెబుతోంది.

అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఆహార అలవాట్లను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఉప్పును బాగా తక్కువ తీసుకునే వారితో, అప్పుడప్పు తీసుకునే వారితో పోల్చితే.. ప్రతీసారీ ఉప్పు ఎక్కువగా తీసుకునే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందని తేలింది. 

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ, గుండె సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే ఉప్పు ఎక్కువైతే టైప్‌ 2 డయాబెటిస్‌ కూడా వచ్చే అవకాశం ఉన్నట్ల పరిశోధనల్లో తేలింది.

మధుమేహానికి కారణమయ్యే ఇతరు కారకాలతో సంబంధం లేకుండా.. ఉప్పు కారణంగా మధుమేహం బారిన పడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. 

అయితే ఉప్పు కారణంగా మధుమేహం ఎందుకు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోయినా. ఉప్పు ఎక్కువుండే ఆహారాన్ని ఎక్కువ తినడమే కారణమని భావిస్తున్నారు.