ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వచ్చే జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఆరెంజ్ సీడ్స్ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
ఆరెంజ్ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలకు సులభతరం చేస్తుంది.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ గింజలు సహాయపడతాయి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
క్యాన్సర్ బారిన పడొద్దంటే ఆరెంజ్ గింజలను తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరెంజ్ సీడ్స్‌లో విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఆరెంజ్ గింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.