నారింజ పండులోని ప్రతిభాగమూ మేలు చేసేదే. ఈ పండు అందానికీ, ఆరోగ్యానికేకాదు.. దీని తొక్కలు చర్మ, కేశ సంరక్షణలో సాయపడతాయి
నారింజ పండు తొక్కలు మొక్కలకీ మేలు చేస్తాయని మీకు తెలుసా? ఇందులో ఉండే విటమిన్-సి చర్మానికీ, ఆరోగ్యానికీ ఎంత మేలు చేస్తాయో మొక్కలకూ అన్ని ప్రయోజనాల్ని ఇస్తాయి
టీ, అరటి, గుడ్డు పెంకుల పొడి వంటి వాటితో ఎన్ని పోషకాలు అందుతాయో నారింజ తొక్కలతోనూ మొక్కలకు అవన్నీ లభిస్తాయి. నారింజ తొక్కల్లో నైట్రోజన్ పుష్కలంగా ఉంటుంది
మొక్కలకు ఇది చాలా అవసరం. అంతేకాదు ఇవి మట్టిలో త్వరగా కలిసి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. పూలూ బాగా పూస్తాయి
నారింజ తొక్కల పొడి రూపంలో లేదంటే ద్రవరూపంలో కూడా మొక్కలకు అందించవచ్చు. నారింజ తొక్కలను కొన్నిరోజులు నానబెట్టి ఆ నీటిని మొక్క మొదట్లో పోయాలి
వీటిలోని సహజ పోషకాలు మొక్కలకు అందుతాయి. అలాగే వీటినే ఎండబెట్టి పొడి చేసి మొక్కల చుట్టూ చల్లితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి
మొక్కలు ఎండినట్లు, కుళ్లినట్లుగా కనిపిస్తే నారింజ తొక్కలను మొక్క మొదట్లో వేయాలి. ఇవి సూక్ష్మక్రిముల్ని నాశనం చేసి, మొక్కలను సంరక్షిస్తాయి
వీటి నుంచి వచ్చే వాసన మొక్కలకు వచ్చే చీడపీడలను నివారించి.. చీమలు, పురుగులు వంటి వాటిని దరిచేరనీయవు. ఇందుకు ఎండిన నారింజ తొక్కలను మొక్క మొదట్లో వేయాలి