ఈ ప్రదేశాల సందర్శన డేర్ డెవిల్స్ మాత్రమే సాధ్యం..

TV9 Telugu

16 June 2024

మెక్సికోలోని అకాపుల్కో అద్భుతమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. 136 అడుగుల లోతైన సముద్రంలోకి దూకి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు.

నేపాల్ లోని మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోని ఎత్తైన శిఖరం. సవాలును కోరుకున్న పర్వతారోహకులు ఇక్కడక వస్తారు.

ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే సన్నద్ధత, శారీరక ఓర్పు, మానసిక దృఢత్వం అవసరం. ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు మధ్య సాహసం చెయ్యాలి.

అట్లాంటిక్ సముద్ర గర్భంలోనే టైటానిక్ షిప్ చరిత్ర ప్రియులు, సాహసికులు, ధనికులను టైటానిక్ టూర్ ఆకర్షిస్తుంది.

టైటానిక్ షిప్ మునిగిపోయిన ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని ప్రాంతానికి తీసుకెళ్లి సముద్ర గర్భంలోని షిప్ శకలాలను చూపిస్తారు.

కెనడియన్ రాకీస్‌లో  ఐస్ క్లైంబింగ్ పర్వతారోహణను మరో స్థాయి అనే చెప్పాలి. డ్డకట్టిన జలపాతాలు, ఎత్తైన మంచు కొండల మధ్య వెళ్ళాలి.

చేతిలో మంచు గొడ్డళ్లు, క్రాంపాన్‌లతో, అధిరోహకులు తమ భౌతిక పరిమితులను అధిగమించి, నిట్టనిలువు కొండల పైకి చేరుకుంటారు.

హారిజోన్‌ స్పేస్ టూరిజంలో స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీలు అనంత విశ్వంలోకి మనల్ని తీసుకెళ్తాయి. అయితే ఇది చాలా ఖరీదైనదే.