బాబోయ్ బంగారం.. అందుకోలేని ఎత్తుకు పెరుగుతున్న ధరలు..

24 October 2023

రెండు నెలల క్రితం ఒక్కసారిగా పెరిగిన టమాట ధర ఇటు రైతులకు, అటు వ్యాపారులకు సిరులు కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే నెల తిరిగేసరికి ఒక్కసారిగా టమాటా ధర అమాంతం పడిపోయింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది అనుకుంటే.. ఇంతలోనే ఉల్లి ఘాటెక్కుతోంది.

పండగల సమయంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త తక్కువగా ఉన్న.. ఇప్పుడు మార్కెట్‌లో కేజీ 45 నుంచి 50 రూపాయలు పలుకుతున్నాయి.

దీంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు మరోసారి పెరుగుతున్నాయని సామాన్య ప్రజలు, వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఉల్లిని దిగుమతి చేసుకుంటారు.

ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమవ్వడంతో ఉల్లి ఉత్పత్తిపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు కొత్త దిగుబడి ఇంకా అందుబాటులోకి రాకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. విశాఖపట్నంలో కేజీ ఉల్లి పాయల ధర 50 రూపాయలుగా ఉంది.

ఇక రైతుబజార్‌లో 40 రూపాయలకు అమ్ముతున్నారు. కర్ణాటకలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదికూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణం అని చెబుతున్నారు.