జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, చుండ్రు, అకాలంగా నెరవడం.. వంటి ఇలా పలు సమస్యలు ప్రస్తుత యువతను వెంటాడుతున్నాయి. క్రమంగా జుట్టు పలచబడి మనోవేదనను మిగులుస్తున్నాయి
ఈ సమస్యలన్నింటికీ ఉల్లిపయ నూనెతో చెక్ పెట్టొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ నూనెను ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు. అందుకు ఏమేమి కావాలంటే..
మీడియం సైజు 2 ఎర్ర ఉల్లిపాయలు, కప్పు కొబ్బరి నూనె, కప్పు నువ్వుల నూనె తీసుకోవాలి. ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలు మిక్సీ జార్‌లో వేసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి
ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టి, అందులో ఈ ఉల్లిపాయ పేస్ట్, కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి పెద్ద మంటపై మరిగించాలి. ఒక పొంగువచ్చిన తర్వాత సిమ్ చేసి అరగంట పాటు మరిగించుకోవాలి
ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి. తర్వాత స్టౌ కట్టేసి నూనె చల్లబడ్డాక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఈ నూనెను వడకట్టుకట్టుకుంటే సరి
దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి 6 నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. ఉల్లిపాయ నూనెను రాత్రి కుదుళ్లకు పట్టించి మునివేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి
ఇలా చేయడం వల్ల కుదుళ్లలో రక్తప్రసరణ మెరుగుపడి, నూనెలోని పోషకాలూ కుదుళ్లలోకి ఇంకుతాయి. ఫలితంగా కుదుళ్లు దృఢమై జుట్టు రాలడం తగ్గుతుంది