హైదరాబాద్ వన్ డే ట్రిప్.. అతి తక్కువ ధరతో..
TV9 Telugu
07 August 2024
హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్‌లో భాగంగా రూ.380కి నాన్ ఏసీ బస్సు, రూ.500కు ఏసీ బస్సు, పిల్లలకు నాన్ ఏసీ బస్సు రూ.300, ఏసీ బస్సు రూ.400గా నిర్ణయించారు.
ఈ వన్ డే ట్రిప్ ఉదయం 7:30 గం బేగంపేట యాత్రి నివాస్ దగ్గర మొదలవుతుంది. 7:45 గం పర్యాటక భవన్ దగ్గర, 8:15 గం బషీర్‌బాగ్ CRO ఆఫీస్ దగ్గర కూడా ఎక్కొచ్చు.
ముందుగా బిర్లా మందిర్ దర్శనం చేసుకొని తర్వాత చార్మినార్, మక్కా మసీదుల చుసిన తర్వాత లాల్ బజార్‌లో షాపింగ్కి కాస్త టైమ్ ఇస్తారు.
అనంతరం హైదరాబాద్ ఫేమస్ సాలార్‌జంగ్ మ్యూజియం సందర్శన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత నిజాం మ్యూజియం చూస్తారు.
అనంతరం గోల్కొండ కోటను చూసి కోటకు దగ్గర్లో ఉండే కుతుబ్ షాహీ టోంబ్స్ టైమ్‌ని బట్టి చూపుతారు. లేదంటే బస్సు రన్నింగులోనే చూసేయాలి.
తర్వాత సిటీలో ఐమ్యాక్స్(ఖైరతాబాద్) మీదుగా చివరగా లుంబినీ పార్క్ దగ్గర రాత్రి 7:30 గంటలకు మీ వన్ డే ట్రిప్ పూర్తవుతుంది.
వీటితో పాటు టూరిస్టులు కోరుకుంటే హిమాయత్ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు.
ఈ ట్రిప్‌కు శుక్రవారం రోజున వెళ్తే నగరంలోని అన్ని మ్యూజియమ్స్‌ను చూడలేరు. వీటికి బదులు నెహ్రూ జూ లాజికల్ పార్కును సందర్శించొచ్చు.
ఈ వన్ టూర్ ప్యాకేజీని
https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour
లింకుపై క్లిక్ క్లిక్ చేసి బుక్ చెయ్యవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి