ఓమాడ్‌ డైట్‌ అంటే ఏంటో తెలుసా..? లాభాలు తెలిస్తే పరేషాన్‌ అవుతావ్‌..

March 29, 2024

TV9 Telugu

ఆరోగ్యకరమైన జీవనం కోసం ఎన్నో రకాల డైట్‌లు ఫాలో చేస్తుంటాం. కానీ మీరు 'ఓమాడ్‌ డైట్‌' గురించి ఎప్పుడైనా విన్నారా? సత్వర ఫలితాలు పొందేందుకు ఇప్పుడు అందరూ దీనినే ఫాలో అవుతున్నారు

సత్వర ఫలితాలు ఇవ్వడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ డైట్‌తో ముఖ్యంగా బరువు తగ్గడం నుంచి మానసిక ఆరోగ్యం మెరుగుదల వరకు గణనీయ మార్పులు సాధ్యమట

అసలింతకీ ఓమాడ్‌ డైట్ అంటే ఏంటంటే.. 'వన్‌ మీల్‌ ఏ డే' అని అర్ధం. అంటే.. ఒక్కపూట భోజనం చేసి మిగతా సమయం అంతా ఏం తినకుండా బ్రేక్‌ ఇవ్వడం అన్నమాట

దీని వల్ల ఈజీగా శరీరంలోని కేలరీలు బర్న్‌ అవుతాయట. చాలా గంటల సేపు తినడానికి విరామం ఇచ్చేస్తాం కాబట్టి శరీరంలోని కొవ్వులు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు

ఇంతలా గ్యాప్‌ తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుందంటున్నారు. ఈ డైట్‌ ఫాలో చేసే వ్యక్తి రోజువారీగా ఒక్కసాగే కడుపు నిండుగా భోజనం చేస్తారు 

ఇలా తిన్న ఆహరం ఒకటి నుంచి రెండు గంటల తర్వాత జీర్ణం అవుతుంది. ఆ తర్వాత నుంచి దాదాపు 20 నుంచి 23 గంటలు విరామం ఇస్తారు

మొదటిసారి చేసేవారు16 గంటల విరామం తీసుకోవాలి. ఆ తర్వాత క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. ఈ డైట్‌ ఆర్యో శ్రేయస్సును పెంచి అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుతుందట

ఈ డైట్‌ వల్ల ఈజీగా బరువు తగ్గడమేకాదు ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు