ప్రసవానంతరం అందుకే ఈ గింజలు తీసుకోవాలట..!

March 08, 2024

TV9 Telugu

ప్రసవమయ్యాక బరువు పెరగడం, జుట్టు ఊడిపోవడం.. వంటి శారీరక మార్పులు ప్రతి మహిళా తన జీవితం తప్పక చవిచూస్తుంది. వీటన్నింటికీ అలీవ్‌ గింజలతో చెక్ పెట్టచ్చంటున్నారు పోషకాహార నిపుణులు

కొత్తగా తల్లైన మహిళల్లో అందం తగ్గిపోవడం, బరువు పెరగడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలు కామన్‌! ప్రసవానంతరం తిరిగి కోలుకోవడానికి సహాయపడే పదార్థాల్లో అలీవ్‌ గింజలకు ప్రత్యేక స్థానం ఉంది

తల్లైన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ ఈ గింజలు తోడ్పడతాయి. ఐరన్‌, ఫోలికామ్లం, విటమిన్‌ ‘ఎ’, విటమిన్‌ ‘ఇ’, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పోషకాలు వీటిల్లో పుష్కలంగా ఉంటాయి

రోగనిరోధక శక్తిని పెంచడం మాత్రమేకాకుండా సులభంగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే కొత్తగా తల్లైన మహిళలేకాకుండా యుక్తవయసు అమ్మాయిలు, మెనోపాజ్‌కు చేరువైన మహిళలు కూడా అలీవ్ గింజలను తప్పకుండా తీసుకోవాలి

మనసు బాగోలేనప్పుడు, తీపి తినాలన్న కోరిక కలిగినప్పుడు అలీవ్‌ గింజలు తీసుకోవడం మంచిది. ఇవి పిల్లల్లో ఏకాగ్రతను పెంచి, తక్షణ శక్తిని ఇస్తాయి. కొబ్బరి-నెయ్యితో లేదా పాలల్లో కలిపి తీసుకుంటే పోషకాలు పుష్కలంగా అందుతాయి

వీటిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చర్మంపై పిగ్మెంటేషన్‌ని తగ్గించడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, మానసిక ఒత్తిళ్లు దూరం చేయడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి

ఫోలికామ్లం, ఐరన్‌, విటమిన్లు ఎ, ఇ.. వంటి పోషకాలు నిండి ఉన్న ఈ సూపర్‌ ఫుడ్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిటికెడు అలీవ్‌ గింజల్ని పాలల్లో నానబెట్టి లేదా లడ్డూలు-ఖీర్‌ రూపంలో తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి

అలీవ్ గింజలు నెయ్యి, కొబ్బరి, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకొని తినవచ్చు. వీటిని మధ్యాహ్నం భోజనం సమయంలో తినాలి. రాత్రిపూట చిటికెడు అలీవ్‌ గింజల్ని పాలల్లో వేసి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత వీటిని తాగితే పోషకాలు అందుతాయి