చర్మం జిడ్డుగా ఉంటే.. ఇలా చేసి చూడండి! 

January 25, 2024

TV9 Telugu

ముఖం ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా కొంతమందికి చర్మం జిడ్డునే ఉంటుంది. చర్మంలోని సెబేషియస్ గ్రంధులు అధికంగా స్రావాలను ఉత్పత్తి చేయడం వల్ల ఇలా జరుగుతుంది

ఫలితంగా ముఖం జిడ్డుగా ఉండటం మాత్రమే కాకుండా దీనివల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అయితే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు

టోనింగ్, స్క్రబ్బింగ్, ఫేస్‌ప్యాక్ చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. వెనిగర్, రోజ్ వాటర్‌ల మిశ్రమం చక్కటి టోనర్‌లా పని చేస్తుంది

జిడ్డుచర్మంపై మురికిని వదిలించుకోవడానికి ఎప్పటికప్పుడు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. చర్మంపై మృతకణాలను తొలగించుకోవడం వల్ల చర్మ గ్రంధులు తెరచుకుంటాయి

బాదం పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి స్ర్కబ్‌లా ఉపయోగించాలి. అలాగే రెండు చెంచాల ఓట్స్ పొడిలో, కలబంద గుజ్జు మిక్స్ చేసి, ఆ మిశ్రమంతో ముఖానికి మర్దన చేసుకోవాలి 

ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇది కూడా చర్మంలోని జిడ్డుదనాన్ని సహజంగా తగ్గిస్తుంది. అయితే స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అప్త్లె చేయడం మర్చిపోకూడదు

గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనె, శెనగపిండి కలిపితే ప్యాక్‌ రెడీ. ఈ ప్యాక్‌ను ముఖానికి పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి

అలాగే పోషకాహారం తీసుకోవాలి. నూనె ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని అధిగమించే యోగాసనాలు వేస్తుండాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది