మెరిసే చర్మం కోసం ‘ఆయిల్ క్లెన్సింగ్’

06 October 2023

ఆయిల్‌ క్లెన్సింగ్‌తో ముఖారవిందాన్ని పెంచుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. దీని వల్ల చర్మ ఛాయ మెరుగుపడటంతోపాటు అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు

చర్మ ఛాయ మెరుపుకోసం

ఈ సౌందర్య పద్ధతితో నూనెతో ముఖం ఎలా కడుక్కోవాలంటే.. మీ చర్మతత్వాన్ని బట్టి టీస్పూన్‌ నూనెను అరచేతుల్లోకి తీసుకొని బాగా మర్దన చేయడం వల్ల అది కాస్త వేడెక్కుతుంది

నూనె కాస్త వేడెక్కాక

ఇప్పుడు ఆ నూనెను మెడ నుంచి గడ్డం, బుగ్గలు, నుదురు దాకా గుండ్రంగా తిప్పుతూ ముఖం పైవైపుగా రెండు చేతులతో ముఖానికి రెండు వైపులా మర్దన చేస్తూ నూనెను పట్టించాలి

గుండ్రంగా తిప్పుతూ

ఇలా కొన్ని నిమిషాల పాటు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముఖ చర్మంలోని రంధ్రాల్లోకి నూనె బాగా ఇంకి ముఖంపై పేరుకున్న దుమ్ము-ధూళి, మేకప్‌ అవశేషాలను మెత్తబరుస్తుంది

ఆ అవశేషాలన్నీ

తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచి పిండిన శుభ్రమైన గుడ్డతో ముఖంపై వేసుకొని కళ్లుమూసుకుని  రిలాక్స్‌ అవ్వాలి. 10 నిమిషాల తర్వాత అదే గుడ్డతో జిడ్డు లేకుండా ముఖాన్ని తుడుచుకోవాలి

నీటిలో ముంచి పిండిన

చర్మ రంధ్రాల్లోకి చేరిన దుమ్ము-ధూళి, మేకప్‌ అవశేషాలను నూనె తొలగిస్తుంది. వేడి నీళ్లతో తడిపిన గుడ్డ జిడ్డును తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది

చర్మాన్ని మృదువుగా

ఆ తర్వాత పొడి టవల్‌తో ముఖం తుడిచేసుకుంటే ఆయిల్‌ క్లెన్సింగ్‌ ప్రక్రియ పూర్తియనట్లే.. మీది పొడి చర్మమైతే ఈ ప్రక్రియ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి

మాయిశ్చరైజర్‌ రాసుకుంటే

అయితే చర్మతత్వాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోవిధమైన నూనెల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. జిడ్డు చర్మానికి గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌, గుమ్మడి గింజల నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెలు.. పొడి చర్మానికి అవకాడో, బాదం, ఆలివ్‌ నూనె ఎంచుకోవాలి

చర్మతత్వాన్ని బట్టి ఎంపిక