09 June 2024

గుండె సమస్యలు రావొద్దంటే.. రాత్రుళ్లు ఇలా చేయండి 

Narender.Vaitla

రాత్రి తీసుకునే భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి లైట్ ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.

ఇక రాత్రి 8 గంటలలోపు తినడాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం కూడా గుండె సమస్యలకు కారణమని పలు అధ్యయనాల్లో తేలాయి.

డిన్నర్‌లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కొలెస్ట్రాల్ నియంత్రణ ఉంటుంది.

ఇక వ్యాయామం అనగానే మనం ఉదయం చేసేది మాత్రమే అనుకుంటాం. అయితే సాయంత్రం చేసే వ్యాయామం కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే తేలికపాటి వ్యాయామం చేయాలి.

గుండె సంబంధిత సమస్యలకు ఒత్తిడి కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడిని జయించడానికి యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగితే బాత్‌రూమ్‌కు లేవాల్సి వస్తుందని తక్కువ తీసుకుంటారు. అయితే అలా చేయకూడదు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా సరిపడ నిద్ర ఉండాలి. కచ్చితంగా 8 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పడుకునే ముందే గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.