ఆ 6 ఎయిర్‌పోర్టుల్లో వార్ రూమ్స్.. విమానాల ఆలస్యం వేళ కొత్త ప్రణాళికలు
TV9 Telugu
18 January 2024
పొగమంచు వల్ల దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన పౌర విమానయాన శాఖ.. ఇప్పటికే ఎయిర్‌లైన్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజాగా ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు మరికొన్ని చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ.
దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ‘వార్ రూమ్స్’ ఏర్పాటు చేయనున్నారు భారతదేశ పౌర విమానయాన శాఖ అధికారులు.
విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో ఎయిర్‌లైన్లకు డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతికూల వాతావరణం వల్ల మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే సందర్భంలో విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని డీజీసీఏ తెలిపింది.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది పౌర విమానయాన శాఖ.
దీంతో ఎయిర్లైన్స్ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది టూరిస్టులు ఇప్పటికి ఆలస్యానికి చింతిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి