వేప పువ్వు గురించి ఈ నిజాలు తెలియకపోతే చాలా నష్టపోతారు

Jyothi Gadda

12  April 2024

వేప ఆకులానే వేప పువ్వులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉగాది పచ్చడిలో వేప పువ్వును వేసుకొని తింటాము. వేప పువ్వు తింటే శరీరం వజ్రంలా మారుతుందని పెద్దల మాట.

వేప పువ్వును సేకరించి శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరాక గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ వేప పువ్వు ఎంతకాలం అయిన నిల్వ ఉంటుంది. వేప పువ్వును పొడిగా కూడా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.

వేప పువ్వు జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. దీనిని వంటల్లో పొడి రూపంలో వాడతారు. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేప పువ్వు పొడిలో నీళ్లు కలిపి మొటిమలపై రాస్తే..మొటిమలు తగ్గటమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.

కొన్ని వేప పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. వేప పువ్వు జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. వేప పువ్వును పొడిగా చేసుకుని వంటల్లో వాడితే ప్రయోజనం ఉంటుంది.

తలనొప్పి, చెవినొప్పితో బాధపడేవారు వేప పువ్వులు వేసి ఆవిరిపట్టుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారు వేపనూనెను రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.

అలాగే దురద వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. బ్యాక్ హెడ్స్ ని తగ్గిస్తుంది. వేప పువ్వులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మంలో అధిక జిడ్డును,పొడిదనంను తగ్గించటంలో సహాయపడుతుంది.

వేప పువ్వుల పొడిలో నీటిని కలిపి తలకు బాగాపట్టించి మసాజ్ చేయాలా. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు, దురద వంటి సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అంతేకాక జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.

మన శరీరంలోని చెడు కొవ్వును తొలగించే శక్తి వేప పువ్వుకు ఉంది. వేప పువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేప పూలతో రసం చేసుకుని తింటే మంచిది. వేప పువ్వుకు పురుషత్వాన్ని పెంచే శక్తి ఉంది.