ఈ గుండెకు ఏమవుతోంది.? భయపెడుతోన్న NCRB డేటా.. 

08 December 2023

ప్రస్తుతం గుండె పోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో భారత్‌లో హార్ట్ ఎటాక్‌ రోగాలు పెరుగుతున్నాయి. 

కొవిడ్‌ 19 మహమ్మారి వ్యాప్తి తర్వాత హృదయ సంబంధిత రోగాలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఎన్‌సీఆర్‌బీ గ‌ణాంకాల ప్ర‌కారం 2022లోనే గుండెపోటు కేసులు 12.5 శాతం పెరిగాయి. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. 

2021లో 28,413 మంది గుండె పోటుతో మ‌ర‌ణిస్తే 2022లో ఆ సంఖ్య ఏకంగా 32,457కు పెరిగింది. 2020లో ఈ సంఖ్య 28,579 గా ఉంది. 

పెరిగిన ఈ హార్ట్ ఎటాక్‌ కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. దీనికి కారణాలపై దృష్టి సారించాల్సిన అసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

గుండె ఆరోగ్యంపై కరోనా ప్రభావం కచ్చితంగా పడిందని ఈ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ త‌ర‌చూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇక నిత్యం వ్యాయామం చేయడం, మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉండాలని మంచి ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. 

గుండె ఆరోగ్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంచాల్సి అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.