ప్రతిదీ మర్చిపోతున్నారా? మతిమరుపు ఇలా దూరం చేయండి

18 December 2023

ఈ రోజుల్లో మతిమరుపు ప్రతి ఒక్కరినీ వేధించే సమస్యల్లో ముఖ్యమైనది. ఒక్కోసారి  తోటి స్నేహితుల పేర్లు మర్చిపోవడం, పది సార్లు చూసినా సినిమా అయినా పేరు మర్చిపోవడం వంటివి జరుగుతుంటాయి

చాలామందికి ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల ఇలా చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం

ఈ మతిమరుపును పోగొట్టుకోవడమెలా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. అందుకు రోజూ ఈ కింది పనులను అలవాటుగా మార్చుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు

రోజూ పత్రికల్లో వచ్చే సుడోకు, పజిల్స్, పొడుపు కథలు, లాజిక్‌తో ముడిపడి ఉండే ప్రశ్నలు వంటి వాటిని పూర్తి చేస్తున్నప్పుడు మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది

ఎక్కడ ఏ పదం నింపామో కూడా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజూ ఏదో ఒక సమయంలో వీటిని సాధన చేయడం ద్వారా మతిమరుపును దూరం చేసుకొని జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు

మతిమరుపుకి మరో ప్రధాన కారణం ఒత్తిడి. యోగా సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గిపోతుంది. దీనితో పాటు ధ్యానం కూడా ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచుతుంది

నిద్ర మెదడుకు పూర్తి విశ్రాంతినిస్తుంది. సరిపడినంత నిద్రలేకపోతే మెదడు పనితీరు తగ్గి సమయానికి ఏమీ గుర్తు రావు. కాబట్టి రోజూ ఏడెనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి 

చేతి వాచీని తిరగేసి పెట్టుకోవడం వల్ల మన జ్ఞాపకశక్తిని పెంచుతుందట. తిరగేసి వాచీ పెట్టుకున్నప్పుడు సమయం గుర్తించగలిగే సామర్థ్యం మెదడుకు వస్తుంది. తద్వారా మెదడు చురుకుదనం పెరుగుతుంది.