చలికాలంలో చాలామందిని వేధించే ప్రధాన జుట్టు సమస్య చుండ్రు. ఇది తలలో మాత్రమే కాకుండా కొంత మందికి కనుబొమ్మల్లో కూడా వస్తుంది
ఈ సమస్యను సహజ పద్ధతుల్లో దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం ఇక్కడ తెలుసుకుందాం
కనుబొమ్మల్లో చుండ్రు రావడానికి ప్రధాన కారణం పొడిచర్మతత్వం. ఈ కాలంలో సరిపడా నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు
అలాగే రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా బాదంనూనె తీసుకొని గోరువెచ్చగా చేసి, దాంతో కనుబొమ్మలకు రోజూ మృదువుగా మర్దన చేసుకోవాలి
మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరి. అయితే ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు
వేప నూనె కూడా వినియోగించవచ్చు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల చర్మ సమస్యలను నివరించడంలో వేపనూనె ఉపయోగపడుతుంది
కొద్దిగా వేపనూనె తీసుకుని దీనిని చుండ్రు ఉన్న కనుబొమ్మలపై అప్లై చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలిపి కూడా వినియోగించవచ్చు
అయితే ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్‌తో కళ్లల్లో పడకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది