చలికాలంలో విటమిన్ డీ లోపాన్ని ఎలా జయించాలి.?
16 January 2024
TV9 Telugu
వింటర్‌లో సూర్యరశ్మి సరిగ్గా లభించని కారణంగా చాలా మందిలో విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది. దీంతో చాలా మంది కీళ్లనొప్పులు, వాపులతో బాధపడుతారు.
వారంలో కనీసం రెండుసార్లు 10 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే చలికాలంలో సహజంగా లభించే విటమిన్ డీలో ఆటంకాలు ఏర్పడుతాయి. అలాంటి సమయాల్లో ఏం చేస్తే విటమిన్ డీ లోపాన్ని జయించవచ్చే ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా విటమిన్ డీ శరీరానికి సరిగ్గా అందకపోతే.. శరీరం క్యాల్షియమ్, ఫాస్పరస్‌ను గ్రహించే శక్తిని కోల్పోవడంతో ఎముకలు, కండరాల నొప్పులు బాధిస్తుంటాయి.
చలికాలంలో విటమిన్ డీ ఎక్కువగా లభించే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ప్రధానమైంది గుడ్లు. రోజుకో గుడ్డు తీసుకోవాలని చెబుతున్నారు
అలాగే వింటర్‌లో వీలైనన్ని ఎక్కువసార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సీ ఫుడ్స్‌లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డికి పుట్టగొడుగులు పెట్టింది పేరు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో పెరిగిన పుట్టగొడుగుల్లో విటమిన్ డి అధిక స్థాయిలో ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..