చలికాలం దగ్గు వేధిస్తోందా.?
Narender Vaitla
13 November
2024
దగ్గు సమస్యను తగ్గించడంలో తులసి ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నల్లమిరియాలను గోరు వెచ్చని నీటిలో వేసుకొని తాగినా ఫలితం ఉంటుంది. ఈ నీరు తాగడం వల్ల దగ్గు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్లం కూడా దగ్గు సమస్యను దూరం చేస్తుంది. అల్లం టీ లేదా అల్లం వేడి నీటిలో వేసుకొని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
తేనె కూడా దగ్గు సమస్యను దూరం చేస్తుంది. రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో తేనె వేసుకొని తీసుకుంటే దగ్గు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
దగ్గు సమస్య వేధిస్తుంటే పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు సమస్య దూరమవుతుంది. పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆవిరి పట్టుకోవడం కూడా దగ్గుకు సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది. వేడి నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పెట్టుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
మసాలా టీ కూడా దగ్గును తగ్గిస్తుంది. టీలో అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలను వేసుకొని తీసుకోవడం వల్ల దగ్గు సమస్య తగ్గుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..