గ్యాస్ సమస్యను తగ్గించడంలో అల్లం ఉపయోగపడుతుంది. భోజనం చేసే ముందు ఒక స్పూన్ అల్లం రసాన్ని తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.
గ్యాస్ సమస్యతో బాధపడితే సోంపు గింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సోంపు గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది.
భోజనం చేసే ముందు యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. గ్లాస్ నీటిలో పావు టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే లాభం జరుగుతోంది.
వాము కూడా గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది. భోజం చేసిన తర్వాత ఒక స్పూన్ వామును గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే గ్యాస్ సమస్య బలదూర్ అవుతుంది.
జీరా కూడా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయం తాగితే.. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.
వీటన్నింటితోపాటు వ్వాయామాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. యోగా, మెడిటేషన్ వంటివి కూడా అలవాటుగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.