తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, ఉప్పు కారం లేని పచ్చి మామిడి కాయ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
జీర్ణ ఎంజైములు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది ఎక్కువగా అల్లం, పసుపు, జీలకర్ర వంటివి వాటిలో ఉంటాయి.
ఇక తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే జీలకర్రను నీటిలో కలుపుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నాన బెట్టి తాగితే మరింత లాభం
భోజనం చేసే అరగంట ముందు అల్లం రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది.
భోజం చేసిన తర్వాత పుదీనా ఆకులు నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
ఇక తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్వాలంటే కచ్చితంగా తగినంతా నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.