తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు కొన్ని జీవన శైలిలో చేసే మార్పులతో శరీరంలో మంచి కొవ్వును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవవడం ద్వారా మంచి కొవ్వు పెరుగుతుంది. ముఖ్యంగా యాపిల్స్, నారింజ, క్యారెట్ వంటి వాటిని తీసుకోవాలి.
ఇక ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న సంబంధిత వస్తువులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
శరీరంలో మంచి కొవ్వును పెంచడంలో చేపలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే వ్యాయామాన్ని తప్పకుండా అలవాటు చేసుకోవాలని నిపుణణులు చెబుతున్నారు. శారీరక్ర మంచి మంచి కొవ్వు పెంచడంలో దోహదపడుతుంది.
ముఖ్యంగా సైక్లింగ్ చేయడం, ఈత కొట్టడం, బరువులు మోయడం వంటివి చేయడం వల్ల మంచి కొవ్వును పెంచుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వెంటనే మానేయాలని నిపుణులు చెబుతున్నారు. పొగ మానేసిన వారిలో కేవలం మూడు వారాల్లోనే మంచి కొవ్వు పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.