27 June 2024

తామరకు ఇంట్లోనే ఇలా చెక్‌ పెట్టండి.. 

Narender.Vaitla

తామర రావడానికి ప్రధాన కారణాల్లో ఎక్కువగా టైట్ దుస్తులు ధరించడమే. అందుకే వీలైనంత వరకు గాలి తగిలే దుస్తులు ధరించాలి. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు లూజ్‌ డ్రస్‌లను ధరించాలి.

తామరకు చెక్‌ పెట్టడంలో యాపిల్ సైడర్‌ వెనిగర్ ఉపయోగపడుతుంది. యాపిల్ సైడర్‌ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తామరకు చెక్‌ పెడుతుంది. 

తామర ఉన్న చోట ఓట్ మిక్స్‌ను రాస్తే ఫలితం ఉంటుంది. ఇందుకోసం గోరు వెచ్చని నీటిలో ఓట్స్‌ను వేసి మెత్తగా రుబ్బి అప్లై చేసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

చామంతి టీ కూడా తామరను తగ్గిస్తుంది. కాచి చల్లార్చిన చామంతి టీని తామర ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

తామరకు చెక్‌ పెట్టడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కబలంద గుజ్జున్‌ తామర ఉన్న చోట అప్లై చేస్తే సరిపోతుంది.

కొబ్బరి నూనె కూడా తామరను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. స్నానం చేసిన తర్వాత తామర ఉన్న చోట కొబ్బరి నూనెను అప్లై చేస్తే సమస్య తగ్గుతుంది. 

వేప రసం కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తామర ఉన్న చోట కాస్త తామర రసం రాస్తే తామర తగ్గుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.