మహిళలు గర్భం దాల్చిన సమయంలో శరీరంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయి. వీటివల్ల వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు చూపుతాయి. వీటిలో ఒకటి స్ట్రెచ్ మార్క్స్.
గర్భధారణ సమయంలో సాధారణంగా మహిళల్లో కనిపించే లక్షణం బరువు పెరగడం. ముఖ్యంగా కడుపులో బిడ్డ పెరగడం వల్ల కడుపు సాగుతుంది.
దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చర్మం మళ్లీ ముందులాగా మారడంతో కడుపుపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. దీంతో కడుపుకు దిగువభాగంలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.
ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే గర్భిణీలు శరీరాన్ని వీలైనంత వరకు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. గర్భాధారణ సమయంలో హార్మోన్ల కారణంగా చర్మం పొడిబారుతుంది. కాబట్టి తగిన నీరు తాగాలి.
నీటితో పాటు చర్మం కూడా హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మాయుశ్చరైజర్లు ఉపయోగించాలి. గర్భిణీ స్త్రీలకు కొబ్బరి నూనె ఉత్తమ మాయిశ్చరైజర్‌గా చెప్పుకొవచ్చు.
కొబ్బరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. అలాగే చర్మాన్ని మదువుగా ఉంచేలా ఉపయోగపడుతుంది.
గర్భదారణ సమయంలో పొత్తి కడుపులో కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. దీనివల్ల సాగిన గుర్తుల నుంచి రక్షణ లభిస్తుంది. కాబట్టి డెలివరి తర్వాత కూడా స్ట్రెచ్ మార్క్స్ రావు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.