ఆహారాన్ని తీసుకునే సమయంలో చాలా మంది ఆదరబాదరగా తింటుంటారు. అయితే సరిగ్గా నమిలి తినకపోవడం వల్ల ఈ సమస్యబారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక మనలో చాలా మంది భోజనం చేస్తున్న సమయంలో నీటిని తాగుతుంటారు. అయితే దీనివల్ల కూడా కడుపుబ్బరం సమస్య వెంటాడుతుంది. అందుకే తినే సమయంలో నీటిని తాగకూడదు.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే ఆహారాన్ని కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పప్పులు వండే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పప్పులను వండే ముందు నానబెట్టాలి. వీటివల్ల త్వరగా ఉడకడంతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. కడుపుబ్బరమూ తగ్గుతాయి.
కడుపుబ్బరం సమస్యతో బాధపడుంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా మజ్జిగ, పెరుగు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలని. వీటివల్ల మలబద్ధకం తగ్గడంతో పాటు, తిన్నది సరిగ్గా జీర్ణమైతే కడుపుబ్బరమూ తగ్గుతుంది.
సరిపడ నీరు తాగకపోయినా కడుపుబ్బరం సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజులో కచ్చితంగా 8 నుంచి 10 గ్లాసుల నీటిని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.