కడుపులో మంట ఎక్కువగా ఉంటే బెల్లం తినాలి. బెల్లంను కొంచెం, కొంచెం చప్పరిస్తూ ఉండడం వల్ల అసిడిటీ సమస్య దూరమవుతుంది.
అసిడిటీకి తులసి ఆకులు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. రోజు భోజనం చేసే ముందు తులసి ఆకులను తినడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీటిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ సమస్యత దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు కొబ్బరి నీళ్లు తాగి పడుకుంటే రిలీఫ్ ఉంటుంది.
పెరుగులో కాస్త తేనె కలిపి తీసుకుంటే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర వేసుకుని తిన్నా వెంటనే రిలీఫ్ ఉంటుంది.
కడుపులో మంటను తగ్గించడంలో కీర దోసకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. కీర దోసకాయ తినడం, కీరదోస జ్యూస్ తాగడం వల్ల కడుపులో మంట సమస్య దరిచేరదని అంటున్నారు.
ఇక అసిడిటీ, కడుపులో మంటతో ఇబ్బంది పడేవారు మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వేపుడు పదార్థాలు, ఊరగాయ పచ్చళ్లు తీసుకోకూడదు.
భోజనం చేసే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కడుపులో మంట సమస్య నుంచి బయటపడతాం.
పైన తెలిపిన విషాయలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.