అల్లం సహజ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీర నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్టమెంటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి.
పసుపులో కూడా అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపును పాలలో కలుపుకుని తాగితే మంచి ఫలితం పొందొచ్చు.
దాల్చిన చెక్కను నిత్యం తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, బాడీ పెయిన్, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. గోరువెచ్చిన పాలలో దాల్చిన చెక్క, తేనె కలపి తీసుకుంటే మంచి ఫలితం పొందొచ్చు
చలికాలంలో వచ్చే ఒళ్లు నొప్పులకు ఆపిల్ సైడర్ వెనిగర్ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో గుడ్డను ముంచి, దాంతో శరీరంపై రాస్తే నొప్పులు తగ్గుతాయి.
బెల్లం కూడా ఒళ్లు నొప్పులను దూరం చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుంటే ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఇలా ప్రతీరోజూ చేస్తే మార్పు కనిపిస్తుంది.
ఇక కీళ్ల నొప్పులు తగ్గడంలో రాగులు, జొన్నలు, సజ్జలు బాగా ఉపయోగపడతాయి. శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు అందుతాయి. ఎముకలు దృఢంగా మారి.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఒళ్లు నొప్పలతో బాధపడుతున్న వారు అరటి పండు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నిషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.