తులసి ఆకులతో టీ చేసుకొని తాగితే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ కే, ఏలు పుష్కలంగా ఉండే తులసి టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తలనొప్పి తగ్గించడంలో అల్లం టీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్
ఫ్లమేటరీ గుణాలతో పాటు నొప్పి నుంచి ఉపశమనాన్నిచ్చే రసాయన సమ్మేళనాలుంటాయి.ఫ్లమేటరీ గుణాలతో పాటు నొప్పి నుంచి ఉపశమనాన్నిచ్చే రసాయన సమ్మేళనాలుంటాయి.
చామంతి పూలతో చేసే టీ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇందులోని ఔషధ గుణాలు తలనొప్పి తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
సోంపును నీళ్లలో వేసి మరిగించి టీ చేసుకొని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులో విటమిన్ బి1, బి2, బి3, కాల్షియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
దాల్చిన చెక్క కూడా తల నొప్పి తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు.. నరాలను స్వాంతన పరచి తలనొప్పి తగ్గిస్తాయి.
తలనొప్పికి పుదీనా టీ కూడా బెస్ట్ రెమడిగా చెప్పొచ్చు. పుదీనా టీ తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నారు.
లావెండర్ పూలతో చేసిన టీని తీసుకుంటే తలనొప్పి తగ్గడంతో పాటు ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఒత్తిడి తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.