ఎండదెబ్బ బారిన పడకూడదంటే సమ్మర్‌లో కచ్చితంగా రోజుకు ఒక్కటైనా కొంబరి బోండాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో డీహైడ్రేషన్ సమస్య దరిచేరదు.
ఇక సమ్మర్‌లో కచ్చితంగా పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో 90 శాతం నీటి కంటెంట్ ఉంటుంది. దీంతో ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది.
ఎండలో బయటకు వెళ్లే వారు కచ్చితంగా చేతిలో వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. దాహం వేయకపోయినా నీటిని తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.
సమ్మర్‌లో నిమ్మరసం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా ఉంటుంది. దీంతో డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
ఎండ దెబ్బ తగలకుండా ఉంచడంలో జామ కాయలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో కచ్చితంగా జామ కాయ తీసుకోవాలని చెబుతున్నారు.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో క్యారెట్ కూడా ఎంతనాగో ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్ లేదా నేరుగా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్‌కు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.