TV9 Telugu
28 March 2024
అల్సర్ సమస్య వేధిస్తుందా.?
అల్సర్ సమస్య వేధిస్తే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగు గ్రీన్ టీని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి
అల్సర్ ప్రారంభదశలో కారం, మసాలాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల సమస్య మరింత ఎక్కువుతుంది.
ఉడకబెట్టిన కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర, బీరకాయ, ఆనపకాయ తదితర కూరగాయలను ఉడికించి తినాలి.
అల్సర్ సమస్యతో బాధపడేవారు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. పాలు, పెరుగు, చీజ్, స్వీట్లు వంటి వాటిని తగ్గించాలి.
రాత్రిపూట త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాత్రుళ్లు కారం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు
ఇక ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
అల్సర్‌తో ఇబ్బంది పడితే కూల్ డ్రింక్స్‌ను పూర్తిగా మానేయాలి. అలాగే ఆల్కహాల్‌ను కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టకోకూడదు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..