కడుపు నొప్పి వేధిస్తుందా.? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి.
Narender.Vaitla
కడుపు నొప్పితో బాధపడేవారికి దానిమ్మ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు కడుపు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కడుపు నొప్పి వేధిస్తుంటే కొన్ని వేడి నీటిని తీసుకోవాలి. గ్యాస్ నిండడం ద్వారా వచ్చే కడుపునొప్పి సమస్యక ఈ సింపుల్ చిట్కాతో చెక్ పెట్టొచ్చు
కొన్ని సందర్భాల్లో జీర్ణ సంబంధిత సమస్యల వల్ల కూడా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో జీలకర్ర నీరు మంచి రెమెడిగా ఉపయోగపడుతుంది. రాత్రంతా నానబెట్టిన జీలకర్రను ఉదయం తాగితే ఉపశమనం లభిస్తుంది.
పుదీనా జ్యూస్ తాగినా కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పుదీనా జ్యూస్‌లో కాస్త నిమ్మ రసం కలిపి తీసుకుంటే తక్షణమే మార్పు కనిపిస్తుంది.
ఇక కడుపు నొప్పి బాగా వేధిస్తుంటే కలబంద రసాన్ని తీసుకున్నా ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
తులసి ఆకులు కూడా కడుపు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందలోని లినోలినిక్ యాసిడ్, యాంటీ ఇన్‌ఫ్లమేరటీ పోషకాలు కడుపునొప్పిని తగ్గిస్తాయి.
ఇక సోంపు నీరు కూడా కడుపు నొప్పి సమస్యను దూరం చేస్తుంది. ముఖ్యంగా తిన్న వెంటనే కడుపు నొప్పితో బాధపడేవారు నీటిలో కాస్త సోంపు వేసుకొని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.