04 March 2024

మైగ్రేన్‌ నొప్పి వేధిస్తుందా.? చిట్కాలివే.. 

TV9 Telugu

ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో ప్రతీ 7 మందిలో ఒకరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఈ దీర్ఘకాలిక సమస్యకు కొన్ని సహజ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

డీహైడ్రేషన్‌ కారణంగా కూడా కొందరిలో మైగ్రేన్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా తగినంత నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

మసాజ్‌ ద్వారా కూడా మైగ్రేన్‌కు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మెడ, భుజాల కండరాలను మసాజ్ చేయడం ద్వారా రిలాక్స్‌ అవ్వొచ్చని చెబుతున్నారు. 

 తీసుకునే ఫుడ్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ఇక మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్న వారు త్వరగా జీర్ణమయ్యే ఆహారానికి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఫుడ్‌ తీసుకోవాలంటున్నారు. 

లావెండర్‌ నూనె పీల్చడం ద్వారా మైగ్రేన్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపునులు చెబుతున్నారు. ఈ నూనె వాసన పీల్చగానే నొప్పి తగ్గుతుంది. 

యోగా ద్వారా కూడా మైగ్రేన్‌ తల నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ యోగా చేస్తే ఉపశమనం లభిస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.