ఆ సమయంలో మైగ్రేన్‌ తల నొప్పి వేదిస్తోందా?

27 November 2023

నెలసరి సమయంలో తలెత్తే శారీరక సమస్యలతోపాటు ఒక్కోసారి మైగ్రెన్‌ తలనొప్పి కూడా వేదిస్తుంది. అలాంటప్పుడు మందులతో కాకుండ సహజ పద్ధతుల్లో ఉపశమనం పొందొచ్చు

నెలసరిలో నడుము, కడుపులో నొప్పితోపాటు కొందరిలో విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గడమే మైగ్రేన్‌కి కారణమంటున్నారు నిపుణులు 

కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం నెలసరి వేళల్లో సర్వసాధారణం. అలాగని తక్కువగా నీళ్లు తాగితే సమస్య మరింత పెరగడమే కాకుండా త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు 

అందుకే ప్రతి రోజూ 10 నుంచి12 గ్లాసుల నీళ్లను తప్పక తాగాలి. అయితే ఈ సమయలో ప్యాకేజ్‌డ్‌ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి

గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, మెగ్నీషియం మెండుగా ఉండే నట్స్‌, గింజధాన్యాలతోపాటు ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయలు, చికెన్‌ వంటి ఆహారాలు తీసుకోవాలి 

ఈ విధమైన ప్రత్యేక ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమయంలో వచ్చే మైగ్రేన్‌ నుంచి త్వరిత గతిన ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

సాధారణంగానే నెలసరిలో శరీరం సున్నితంగా తయారవుతుంది. ఈ సమయంలో అనవసర విషయాలతో ఆందోళన పెంచుకుంటే తలనొప్పి మరింత పెరుగుతుంది

అందుకే వీలైనంత వరకూ ఒత్తిడికి దూరంగా ఉంటూ.. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవాలి. మనసుకు నచ్చిన సంగీతం వినడం, పుస్తక పఠనం వంటివి చేస్తే ఇంకా మనసుకి హాయిగా అనిపిస్తుంది