చెమట వాసనతో ఇబ్బంది పెడుతోందా.. స్నానం చేసే సమయంలో ఇలా చేస్తే సరి 

03 October 2024

TV9 Telugu

Pic credit -  Google

వర్షాకాలంలో గాలి ఇప్పటికే అధికంగా తేమఉంటుంది. కనుక బట్టలు పొడిగా ఉండకూడదు. అయితే ఉక్కపోతతో కొంతమందికి విపరీతంగా చెమటలు పడతాయి. అప్పుడు చెమట వాసన కూడా వస్తుంది.  

అయితే ఇలా అందరూ చెమటతో ఇబ్బంది పడరు. చెమటతో బాధపడేవారు కొందరున్నారు. ఇది శరీరంలోని కొన్ని బ్యాక్టీరియా లేదా హార్మోన్ల అసమతుల్యత ప్రభావం వల్ల కావచ్చు.

చెమట కంపు కొడితే అవమానానికి అంతు లేదు. చెమట స్మెల్ నుంచి ఉపశమనం కోసం స్నానం చేసే సమయంలో కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరి. 

చెమట దుర్వాసనను తొలగించడానికి కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్నానం చేసే సమయంలో ఒక బకెట్ నీటిలో 5-6 చుక్కల కొబ్బరి నూనె కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. చెమట దుర్వాసన రాదు.

వంట చేసే సమయంలో కొన్నింటికి బేకింగ్ సోడా ఉపయోగిస్తారు. అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక బకెట్ నీటిలో కలిపి చేయడం వలన చెమట వాసన దూరంగా ఉంటుంది.   

చెమట దుర్వాసన నుంచి బయటపడటానికి  కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి.. ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలపండి. తర్వాత కొద్దిగా వేపనూనెను చర్మానికి పట్టించాలి.

రెండు చెంచాల పసుపు పొడిని ఒక బకెట్ నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ చెమట వాసన లేకుండా చేస్తుంది. 

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

అయితే ఇవన్నీ ఇంట్లో చేసే టిప్స్ ని అని గుర్తుంచుకోండి. ఇన్ని చేసినా చెమట వాసన పోకపోతే వైద్యుడిని సంప్రదించండి.