21 June 2024

ఎన్ని మందులు వాడినా అసిడిటీ తగ్గడం లేదా.? 

Narender.Vaitla

అసిడిటీతో బాధపడేవారు ప్రతీ రోజూ ఉదయాన్నే నాలుగైదు పుదీనా ఆకును నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల అసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చు.

అసిడిటీ సమస్యకు తులసి ఆకులు కూడా ఎంతో ఉపయోగపడుతాయి. భోజనం చేసే ముందు నాలుగైదు తులసి ఆకులను నమలడం వల్ల అసిడీ సమస్య క్రమంగా తగ్గుతుంది.

కొబ్బరి నీళ్లు కూడా అసిడిటీ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన ఒక 30 నిమిషాల తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే అసిడిటీ సమస్య దూరమవుతుంది.

అసిడిటీ సమస్య బారిన పడకుండా ఉండాలంటే భోజనానికి ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అసిడిటీ సమస్య రాదు.

సోంపు కూడా అసిడిటీ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని గుణాలు గ్యాస్‌, స్టామక్‌ యాసిడ్‌ను తగ్గిస్తుంది.

నిత్యం అసిడిటీ సమస్యతో బాధపడుతుంటే చల్లటి పాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పచ్చి పాలలో నిమ్మరసం పిండుకొని తాగినా ఉపశమనం లభిస్తుంది.

అసిడిటీ సమస్యకు అరటి పండ్లు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.