బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సొరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
సొరకాయలో పుష్కలంగా లభించే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు దోహదపడుతుంది.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడేవారికి కూడా సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది.
హైబీపీతో బాధపడేవారు సొరకాయను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ సొరకాయ జ్యూస్ తీసుకుంటే బీపీ సమస్య బలదూర్ అవ్వాల్సిందే.
డీహ్రైడేషన్ సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సొరకాయ ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తుంది
షుగర్ పేషెంట్స్ కూడా సొరకాయను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడంలో సొరకాయ ఉపయోగపడుతుంది.
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా సొరకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.