వీర్య కణాలు సక్రమంగా ఎదగాలంటే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫోలిక్ యాసిడ్ దెబ్బతిన్న వీర్య కణాలను కూడా బాగు చేస్తుంది.
గుడ్లు ప్రోటీన్‌కు పెట్టింది పేరు. ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి వీర్యాన్ని కాపాడడంలో కోడి గుడ్లు ఉపయోగపడతాయి. వీర్య కణాలు చురుకుగా కదలడానికి గుడ్డు సహాయపడుతుంది.
అరటి పండ్లను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ సి వీర్యం నాణ్యతను, వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.
గుమ్మడి గింజలు సైతం వీర్యం నాణ్యతను పెంచుతాయి. ముఖ్యంగా టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తి పుంజుకునేలా చేస్తాయి. మరోవైపు వీటిల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగుపరచటంతో పాటు వీర్యం నాణ్యతనూ పెంచుతాయి.
వీర్య కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే దానిమ్మను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వీర్య కణాల నాణ్యతను పెంచుతాయి.
టమాటలోని విటమిన్ సి, లైకోపేన్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ మగవారిలో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది వీర్య కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డార్క్ చాక్లెట్ కూడా వీర్యం నాణ్యతను మెరుగుపరచడలో ఉపయోగపడుతుంది. ఎల్-ఆర్గినైన్ హెచ్‌సీఎల్ అనే అమైనో ఆమ్లం వీర్యం మోతాదును పెంచుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.