నల్ల జీలకర్ర మన శరీరంలో చేసే అద్భుతాలు నమ్మలేరు!

Jyothi Gadda

19 June 2024

నల్ల జీలకర్రను చేదు జీలకర్ర అని కూడా అంటారు. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.  నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వళ్ళ తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

నల్ల జీలకర్ర నూనె పంటికి  సంబంధించిన, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, పంటి నొప్పిని తగ్గిస్తుంది. నల్ల జిలకరలో థైమోక్విన్ అనే కెమికల్ ఉంటుంది. అది మీ చిగుళ్లను ఆరోగ్యగా ఉంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

వయసు పైబడిన వారిలో మతిమరుపు సమస్య కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్లు ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకుంటే మెమరీ పవర్‌ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు దివ్యౌషధం.

నల్ల జీలకర్ర నూనెలో ఉండే ప్రోటీన్స్‌,ఫాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, నల్ల జీలకర్ర నూనెను కలిపి తలకు రాసుకుంటే జుట్టు పెరిగి ధ్రుడంగా మారుతుంది. అంతేగాక చుండ్రును కూడా తగ్గిస్తుంది.

నల్ల జీలకర్రను చేదు జీలకర్ర అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థమైన కొవ్వును కరిగించడంలో నల్ల జీలకర్ర బేషుగ్గా పనిచేస్తుంది. బీపీని నియంత్రించడంతోపాటు చర్మవ్యాధులనూ అరికట్టడంలో దోహదం చేస్తుంది.

నల్ల జీలకర్ర యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరస్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే వాపులను తగ్గించడంలో… దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది.

నల్ల జీలకర్ర కషాయం తాగడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తయారుచేయడం కూడా తేలిక. ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీ స్పూన్‌ నల్ల జీలకర్రను వేసి అర గ్లాస్‌ అయ్యేవరకు మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి తాగాలి.