వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. అయితే కొంతమంది మాత్రం ఈ పండు తింటే వేడి చేస్తుందని, వీటిల్లో అధిక చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఉంటాయని.. దూరం పెడతారు
దీంతో తినాలనే కోరికను అదుపు చేసుకుంటూ ఉంటారు. నిజానికి మామిడి పండ్లు వేడి చేస్తాయని, వీటివల్ల మొటిమలొస్తాయని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే
నిజానికి వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. వంటి చర్మ ఆరోగ్యానికి మేలే చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మొటిమలు వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు వీటిని మితంగా తింటే మంచిది
మామిడి పండ్లలో క్యాలరీలు, చక్కెరలు అధిక మొత్తంలో ఉండే మాట వాస్తవమే. అలాగని దాని అర్థం బరువు పెరుగుతామని కాదు. మితంగా తీసుకున్నంత వరకు ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది
ఇందులోని ‘ఎ’, ‘సి’ విటమిన్లు, ఐరన్, పొటాషియం, కాపర్, బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరానికి తగిన మోతాదులో అందుతాయట. అందుకే మామిడి పండ్లు తినాలన్న కోరికను చంపుకోకుండా మితంగా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు
గర్భంతో ఉన్నప్పుడు మామిడి పండ్లను తీసుకోకూడదని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇందులోని పోషకాలు సాధారణ వ్యక్తులకు ఎంత అవసరమో గర్భిణులకూ అంతే అవసరం
అయితే అధిక బరువు, జెస్టేషనల్ డయాబెటిస్‌తో బాధపడే గర్భిణులు మాత్రం వీటిని అమితంగా కాకుండా మితంగా తినాలి. అది కూడా పగటి పూట మాత్రమే తీసుకోవాలి
ఇంకా ఈ విషయంలో సందేహంగా ఉంటే.. మామిడి పండ్లను కాసేపు చల్లటి నీటిలో నానబెట్టి ఆపై తీసుకుంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పండ్లకు ఎంత గాలి తగిలితే అవి రుచిగా ఉంటాయి