మున్నార్ లోని పశ్చిమ నుమలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక కొండ స్టేషన్. పచ్చని టీ తోటలతో అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి.
కేరళలోని అలెప్పీ బ్యాక్‌వాటర్‌కు ప్రసిద్ధి చెందిన ఒక పట్టణం.. బ్యాక్‌వాటర్‌లలో హౌస్‌బోట్‌లో కానీ, గ్రామీణ ప్రాంతాల కెనాల్‌లో పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
కోవళం కేరళలోని ప్రసిద్ధ బీచ్. ఇక్కడ ఇసుక చాలా తెల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది
వయనాడ్ కేరళలోని మరొక అందమైన కొండ స్టేషన్. ఇది దట్టమైన అడవులు, కాఫీ తోటలు, వన్యప్రాణులతో నిండి ఉంటుంది.
కుమారకోమ్ బ్యాక్‌వాటర్‌లలో ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం కొబ్బరి తోటలకు, హౌస్‌బోట్‌లకు చాలా ప్రసిద్ధి చెందింది.
ఇడుక్కి కేరళలోని ఒక కొండ ప్రాంతం. ఈ ప్రాంతం ఆనకట్టలు వాటి చుట్టూ అందమైన అడవి ప్రదేశాలతో నిండిఉంటుంది.
త్రిసూర్ ప్రాచీన దేవాలయాలే కాకుండా, వింత వింత సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు ఒక పండగ జరుగుతుంది.
కేరళలో కొచ్చి ఒక ప్రధాన నగరం. దీనికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఓడరేవు అందమైన బీచ్ కూడా ఉంటుంది.
పాలక్కాడ్ కేరళలోని ఒక పట్టణం. ఇక్కడ ప్రాచీన కోటలు ఉండడమే కాకుండా చరిత్ర కలిగిన దేవాలయాలు, దట్టమైన అడవులు కూడా ఉంటాయి.
కాసరగోడ్ కూడా కేరళలోని అందమైన పట్టణం. చుట్టూ అందమైన బీచ్లు, ప్రసిద్ధ కోటలు కూడా ఉంటాయి. అలాగే కొన్ని ప్రాచీన దేవాలయాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి.