కేరళ వెళ్తే కచ్చితంగా ఈ డెజర్ట్‌లు తినాల్సిందే..
TV9 Telugu
14 May 2024
మలయాళీలు పాయసం, ఇతర తీపి వంటకాలకు ఇష్టపడతారు. ఈ రోజు మనం మలయాళీలు ఇష్టపడే కొన్ని డెజర్ట్‌ల గురించి తెలుసుకుందాం.
కేరళ వంటల్లో అదా ప్రధమన్ మొదటి స్థానంలో ఉంది. ప్రత్యేక సందర్భాలలో ఇది తప్పనిసరి. ఇది మలయాళీలు ఇష్టంగా తింటారు.
ఉన్నిఅప్పం కేరళలో ఒకసారైన తినాల్సిన ఆహారం. బియ్యప్పిండి, అరటిపండు, కొబ్బరికాయలతో చేసే ఈ వంటకం మలయాళీలకు ఇష్టమైన వంటకం.
పలాడ ప్రధమన్ కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్వీట్లలో ఒకటి. ఇది బియ్యం, బెల్లం లేదా పంచదార, పాలు, కొబ్బరి పాలతో చేసి పాయసం.
కోజికోడ్ హల్వా గురించి వినని వారు ఉండరు. కేరళలోని కోజికోడ్ ఖ్యాతిని పెంచడంలో హల్వా పెద్ద పాత్ర పోషిస్తుంది.
ఎల్లా అడా చాలా రుచిగా ఉంటుంది. సులభంగా తయారుచేయవచ్చు. ఇది బియ్యప్పిండి, బెల్లం, కొబ్బరి తురుము మరియు యాలకులు కలిపి ఉడికించిన తీపి పిండి.
కిన్నతప్పం బియ్యం పిండి, చక్కెర, కొబ్బరి పాలతో తయారు చేస్తారు. కన్నూర్‌లోని చాలా ఫంక్షన్‌లలో టీతో దొరికే రుచికరమైనది.
వటలప్పం అనేది కొబ్బరి పాలు, బెల్లం కలిపి చేసే డెజర్ట్. గుడ్లు, యాలకులు, చక్కెర, పాల కలిపి ఆవిరితో చేసిన డెజర్ట్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి