దేశంలోనే అత్యంత ఖరీదైన ఐదు వివాహాలు ఇవే! రికార్డులు సృష్టించాయి
TV9 Telugu
11 July 2024
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న జరగనుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇదే అంటున్నారు.
అనంత్ అంబానీ కంటే ముందు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహానికి రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ఇషా లెహంగా రూ.90 కోట్లు, పెళ్లి కార్డు విలువ రూ.3 లక్షలు.
సుబ్రతా రాయ్ 2004లో తన ఇద్దరు కుమారులకు వివాహనికి రూ.554 కోట్లు ఖర్చు చేశారు. దీనికి దేశవిదేశాల నుంచి 11 వేల మంది అతిథులు హాజరయ్యారు.
కర్ణాటకకు చెందిన గాలి జనార్ధన్ రెడ్డి 2016లో రూ.500 కోట్లు ఖర్చుతో చేసిన కూతురు బ్రాహ్మణి పెళ్లికి 50 వేల మంది హాజరయ్యారు.
ఉక్కు వ్యాపారవేత్త ప్రమోద్ మిట్టల్ కుమార్తె సృష్టి మిట్టల్‌కు 2013లో స్పెయిన్‌లో రూ.500 కోట్లు ఖర్చుతో మూడు రోజుల పాటు వివాహం జరిపించారు.
స్టీల్ టైకూన్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ మిట్టల్ 2004లో తన కుమార్తె వివాహనికి పారిస్‌లో 6 రోజుల పాటు 240 కోట్లు ఖర్చు చేశారు.
2015లో వ్యాపారవేత్త సంజయ్ హిందూజా తన చిరకాల స్నేహితురాలు అయినా అనుతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి ఖర్చు 140 కోట్లు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్‌లో జెన్నిఫర్ లోపెజ్ పాల్గొన్నారు.