TV9 Telugu
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇదే!
25 Febraury 2024
మార్కెట్లో సులభంగా దొరికే పుచ్చకాయల రేటు కిలో 50 నుంచి 60 రూపాయలు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వీటిని పండిస్తారు.
జపాన్‌లో మాత్రమే సాగు చేసే జపనీస్ మెలోన్ రకానికి చెందిన యుబారి కింగ్ అనే పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.
యుబారి పుచ్చకాయను జపాన్‌లోని హక్కైడో ద్వీపంలోని యుబారి నగరంలో పండిస్తునందున దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు.
ఈ పుచ్చకాయ దాని సువాసన, ప్రత్యేక రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ పుచ్చకాయలో చాలా తక్కువ విత్తనాలు ఉంటాయి.
ఈ పుచ్చకాయ మార్కెట్లో విక్రయించరట. ఇది కావాలంటే వేలంలోనే దక్కించుకోవాలి. అందుకే భారీ డిమాండ్ పలుకుతోంది.
2022 సంవత్సరంలో ఒక యుబారి పండు 20 లక్షల రూపాయలకు వేలం వేయడం జరిగింది. 2021లో ఈ పండు రూ.18 లక్షలకు విక్రయించారు.
యుబారి కింగ్ ఒక యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పొటాషియంతో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం కూడా ఇందులో ఉన్నాయి. అందుకే మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి