ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప ఇదే..!
TV9 Telugu
15 July 2024
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా. ఈ చేప విలువ మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతుందట.
అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా జీవితకాలం 40 సంవత్సరాల కంటే ఎక్కువ. దీని బరువు 200 కిలోల కంటే ఎక్కువగా ఉంటుంది.
ఇటీవల జపాన్ మార్కెట్లో అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా చేప 2 లక్షల 70 వేల అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది.
అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా చేప ధర మన భారతీయ కరెన్సీలో చూస్తే మాత్రం 2 కోట్ల 20 లక్షల రూపాయలు పై మాటే!
కొన్ని దేశాలలో విషయానికి వస్తే.. అక్కడ అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా చేపను పట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు.
ట్యూనా చేపలు పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువ సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు ఫిస్షింగ్ అధికారులు.
ఔషధ గుణాలు ఎక్కువగా కలిగి ఉన్న ఈ అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా చేప అంతరించిపోతోందని అధ్యయనాల్లో తేలింది.
కోట్ల విలువైన అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా ఫిష్ అధిక బరువు ఉన్న వేగంగా ఈత కొట్టడంలో చాల ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి