ఆందోళన తగ్గించి ఆనందం పెంచే ఆహారాలు..

January 17, 2024

TV9 Telugu

ఒక్కోసారి చిన్న విషయానికే చిరాకు పడి ఎదుటివారిపై అరుస్తుంటాం. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల కూడా ఇలాంటి మూడ్‌ స్వింగ్స్‌ వస్తుంటాయి

ముఖ్యంగా ఈ  రకమైన ఆహారాలు తీసుకుంటే శరీరంలో సెరటోనిన్‌, డోపమైన్‌, ఎండార్ఫిన్లు.. వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ సంతోషాన్ని పెంచే హార్మోన్లు

మానసిక ఒత్తిళ్లు, మూడ్‌ స్వింగ్స్కు దూరంగా ఉండాలంటే.. రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలుండేలా చూసుకోవడం తప్పనిసరి. అవేంటంటే..

మెగ్నీషియం లోపిస్తే నిద్రలేమి, ఆందోళన స్థాయులు పెరిగిపోవడం, యాంగ్జైటీ వంటి ఇబ్బందులు వస్తాయి. ఆకుకూరలు, పప్పులు, నట్స్‌, గింజలు.. వంటి ఆహారాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది

నాడీ వ్యవస్థ పనితీరులో జింక్‌ పాత్ర కీలకం. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, భావోద్వేగాల్ని నియంత్రించడంలో జింక్‌ సహకరిస్తుంది. జింక్ లోపిస్తే మతిమరుపు, డిప్రెషన్‌, వంటి సమస్యలొస్తాయి

జింక్‌ అధికంగా ఉండే కోడిగుడ్లు, పప్పులు, కాయధాన్యాలు, పుట్టగొడుగులు, కొకోవా, పెరుగు.. వంటివి తప్పనిసరిగా చేర్చుకోమంటున్నారు నిపుణులు

విటమిన్‌ బి-12 లోపిస్తే మతిమరుపు వంటి మానసిక సమస్యలు వస్తుంటాయి. పాలు, కోడిగుడ్లు, చేపలు, మాంసం.. వంటి ఆహారాల్లో ఈ విటమిన్‌ అధికంగా ఉంటుంది

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, నట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మూడ్‌ స్వింగ్స్‌ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.