లంగ్స్‌లో కఫం, శ్లేష్మంతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఏ మందులూ అవసరం లేదు

07 July 2024

TV9 Telugu

Pic credit - pexels

గాలి కాలుష్యం, కరోనా వైరస్ వలన ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకీ న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. 

ఊపిరితిత్తుల సమస్య

ఊపిరితిత్తులు పరిశుభ్రంగా కఫము, శ్లేష్మం లేకుండా ఉండాలంటే కొన్ని వంటింటి చిట్కాలు పాటించండి. దీంతో ఈ సీజన్ లో ఇబ్బంది పెట్టె కఫం, శ్లేష్మం లేకుండా పూర్తిగా పరిశుభ్రమవుతాయి.

ఊపిరితిత్తులు పరిశుభ్రంగా

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఆవిరి మంచి మెడిసిన్. వేడి ఆవిరి వల్ల ఊపిరితిత్తులలో ఉన్న శ్రేష్మం కరుగుతుంది. ముక్కు రంధ్రాల్లో ఉన్న పూడికలు తొలగిపోయి శ్వాస సులభంగా తీసుకోవచ్చు. 

ఆరోగ్యానికి ఆవిరి

అల్లంలో ఔషధ గుణాలు మెండు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులను డీటాక్స్‌ చేస్తాయి. ఇవి వాయునాళాలలో పొగను, దుమ్ము, దూళిని తొలగిస్తాయి. ఊపిరితిత్తులలో శ్లేష్మం కరిగించి, ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అల్లం 

గోరువెచ్చటి నీటిలో తేనె, ఒక స్పూన్ నిమ్మరసంతో పాటు చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగడం వలన ఊపిరితిత్తులలో శ్లేష్మం కరుగుతుంది.

నిమ్మరసం 

విటమిన్ సి అధికంగా ఉండే కమలాఫలం, ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇవి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. 

విటమిన్ సి ఉండే ఫలాలు 

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి

దానిమ్మ , యాపిల్ 

పసుపులో ఉండే కర్కుమిన్‌‌‌‌‌‌‌‌‌‌ ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పసుపు సహాయపడుతుంది.  

పసుపు

సుఖాసనం ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన ఊపిరితిత్తుల సామర్ధ్యం బాగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

వ్యాయామం, ప్రాణాయామం