వర్షాకాలంలో దుస్తులు సరిగ్గా ఆరకపోవడంవల్ల ఆరీ ఆరనట్లున్న వాటిని అలాగే వార్డ్‌రోబ్‌లో పెట్టేస్తే అదో రకమైన వాసన రావడం మొదలవుతుంది
TV9 Telugu
లేదంటే వర్షమొస్తుందేమోనని ఒక్కోసారి ఉతికిన బట్టల్ని ఇంట్లోనే ఆరేస్తుంటారు. ఇలా చేసినా దుస్తులు సరిగ్గా ఆరక వాటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. ఇల్లంతా అదే వాసన నిండిపోయింది
TV9 Telugu
వర్షాకాలంలో గాలిలో మరింత తేమ ఉంటుంది. ఫలితంగా, వివిధ సూక్ష్మక్రిములు, శిలీంధ్రాలు పెరుగుతాయి. తడిబట్టల్లో ఇవి త్వరగా చేరతాయి. అందుకే వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో తడి బట్టలను ఆరేయటం మంచిది
TV9 Telugu
వర్షాకాలంలో గాలిలో మరింత తేమ ఉంటుంది. ఫలితంగా, వివిధ సూక్ష్మక్రిములు, శిలీంధ్రాలు పెరుగుతాయి. తడిబట్టల్లో ఇవి త్వరగా చేరతాయి. అందుకే వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో తడి బట్టలను ఆరేయటం మంచిది
TV9 Telugu
వెనిగర్‌లో ఉండే ఆమ్ల స్వభావం దుర్వాసనకు కారణమైన ఫంగస్‌ను నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి దుస్తులపై ఎక్కడైతే వెగటు వాసన వస్తుందనుకుంటే అక్కడ కాస్త వెనిగర్ వేసి రుద్దాలి
TV9 Telugu
ఆపై కాసేపటికి శుభ్రమైన నీటిలో ఉతికి ఆరేస్తే జిడ్డులా అంటుకున్న ఆ వాసన వదిలిపోతుంది. అంతేకాకుండా దుస్తులపై పెరిగిన ఫంగస్‌ను కూడా నశింపజేసి సువాసనను వెదజల్లుతుంది
TV9 Telugu
దుస్తులు ఆరిన తర్వాత బట్టలు మడత పెట్టి వార్డ్‌రోబ్‌లో పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. అవసరమైతే అందులో కొన్ని నాఫ్తలీన్‌తో బిళ్లలు ఉంచవచ్చు. అప్పుడు దుస్తుల నుంచి దుర్వాసన రాదు
TV9 Telugu
లేదంటే వార్డ్‌రోబ్‌లో ఉన్న బట్టలన్నీ బయటికి తీసి.. బ్లీచ్ ద్రావణంలో ముంచిన తడిగుడ్డతో అరలన్నీ తుడిచేయాలి. ఆపై ఆరాక మళ్లీ దుస్తుల్ని ఎప్పటిలాగే సర్దేస్తే సరిపోతుంది. ఈ చిట్కా దుస్తుల దుర్వాసననూ దూరం చేస్తుంది