హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ వరల్డ్-2025 విజేత నిలిచారు.
న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో సమాధానం ఇచ్చి మిస్ వరల్డ్ వజ్రాల కిరీటాన్ని దక్కించుకోవడంతో పాటు రూ. 8.5 కోట్లు నజరానా అందుకున్నారు.
మిస్ వరల్డ్ విజేతకు వజ్రాల కిరీటం, రూ. 8.5 కోట్ల నగదు మాత్రమే కాదు.. ఆమెకు అంతకుమించి లాభాలుంటాయి. అవి ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.
టైటిల్ విన్నర్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మూవీ ఛాన్సులు, మోడలింగ్ కాంట్రాక్టులు, ఎండార్స్‌మెంట్లు లభిస్తాయి.
ఏడాది పాటు లండన్‌లో ఉండొచ్చు. అలాగే నగలు, మేకప్ కిట్లు, డిజైనర్ దుస్తులు లభిస్తాయి. ఇక బ్యూటీ విత్ ఏ పర్పస్'లో భాగంగా ఏడాది పాటు ప్రపంచమంతా ఫ్రీగా తిరగొచ్చు.
‘ఓపల్ ఫర్ హర్’ నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న ఓపల్ సుచాత.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు.
మిస్ వరల్డ్-2025 టైటిల్‌తో మరింత ప్రభావం చూపిస్తానని భావిస్తున్నట్లు చెప్పారు. సుచాతకు ప్రపంచ సుందరి కిరీటం దక్కడంతో థాయిలాండ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.