చిన్నా పెద్దా తేడా లేకుండా ముఖ్యంగా మహిళల్లో చాలామందిని వేధించే సమస్య మైగ్రెయిన్. పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవడంతో కూడా ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు
కొంత మందికి మైగ్రెయిన్‌తో పాటు రాత్రుళ్లు చెమటలు పట్టే ఇబ్బంది కూడా ఉంటుంది. ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు
మైగ్రెయిన్, రాత్రుళ్లు విపరీతమైన చెమటలు పట్టడం ఈ రెండు సమస్యలు దీర్ఘకాలంగా ఉన్న మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందట
ముఖ్యంగా అమ్మాయిల్లో మైగ్రెయిన్ ఉంటే.. వారిలో మెనోపాజ్ లక్షణాలు త్వరగా కనిపిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది అందరిలోనూ ఒకేలా ఉండగకపోవచ్చు
మనవంతు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పోషకాహారం తీసుకుంటూ మంచి నిద్ర, వ్యాయామం ఉండేలా చూసుకోవాలి
అలాగే బీపీ, బ్లడ్ షుగర్, అధిక బరువు, కొలెస్ట్రాల్ స్థాయులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మైగ్రెయిన్ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలోని మెగ్నీషియం, విటమిన్ బి మైగ్రెయిన్‌ను తగ్గిస్తాయి. పచ్చగా ఉన్న కూరగాయలు తినడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు మెరుగుపడి తలనొప్పి దూరం అవుతుంది
తలనొప్పి అనిపించినప్పుడు అరటిపండు తింటే కొంచెం ఉపశమనం ఉంటుందట. అలాగే డార్క్ చాక్లెట్స్ తినడం, నీళ్లు అధికంగా తాగటం, పుట్టగొడుగులు, గుడ్లు, నట్స్ వంటి ఆహారాల్లో ఉండే రిబోఫ్లావిన్ తలనొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది